మేకప్ లేకుండానే మొహం మెరుపుతో ఉండాలి అనుకుంటే సహజసిద్ధమైన ఎన్నో వనరులున్నాయి. హెర్బల్ స్టీమ్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. సహజమైన నూనె గ్లిజరిన్ తో తయారు చేసిన ఫేస్ వాష్, క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. చర్మ రంధ్రాలలో అదనపు నూనె మురికి పోయేందుకు ఒక గిన్నెలో ఆరేడు గ్లాసుల నీళ్లు గుప్పెడు గులాబీ రేకులు పలచగా కోసిన నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించి పది నిమిషాలు ఆవిరిపట్టాలి. ఈ స్టీమ్ ముఖ చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపరచి సహజ మెరుపును అందిస్తుంది.

Leave a comment