ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే రుచికోసం చూడకూడదు.ఉదాహరణకు చేదుగా ఉండే కాకర కాయలు మంచి ఆరోగ్యం ఇస్తాయి.రక్తంలోని చెక్కర నిల్వలు తగ్గిస్తాయి. అధిక బరువు తగ్గించుకోవచ్చు మధుమేహం ఉండేవారికివచ్చే అధిక రక్తపోటు తగ్గుతుంది. బిటాకెరోటిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యల పై పోరాడేందుకు కాకరకాయ వరప్రసాదం.కాలేయంలో ఉండే వ్యర్ధాలను తొలగిస్తుంది సోరియాసిస్ అథ్లెట్ ఫుట్ వంటి చర్మ వ్యాధులు తగ్గించగలుగుతుంది. ఫంగస్ వల్ల వచ్చే అంటు వ్యాధులు తగ్గిపోతాయి.వారంలో రెండు సార్లయినా కాకరకాయని భోజనంలో చేర్చుకోవాలి.

Leave a comment