ఈ చేదు రుచి కాస్త కష్టమే కానీ,ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది కాకర. ఈ కాకర తీగ మొత్తం ఉపయోగమే, కాకర ఆకులు,పూల కాషాయం డయాబెటిస్ గల వారికీ గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రిస్తాయి. పండిన కాకర కాయ నుంచి తీసిన రసం  గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రిస్తుంది . ఆయుర్వేద వైద్యంలో రక్తంలో చెక్కరను తగ్గించేందుకు ఉపయోగించే జంబుల్ చెట్టు బెరడు పొడితో కాకర రసం కలిపి వారంలో రెండు సార్లు తాగితే డయాబెటిస్ కంట్రోల్లోకి వస్తుంది. దీనివల్ల శరీరంలో టాక్టిన్లు కూడా న్యూట్రలైజ్ అవుతాయి. అలాగే నిమ్మ రసంలో కాకరకాయ ముక్కలు వేసి ఒకటి రెండు గంటలు నాననిచ్చి మామిడి తురుము,అల్లం నీరు కలిపి పేస్ట్ చేసి కలిపి మొత్తం గ్రైండ్ చేసి నీళ్ళు పోసి డైల్యూట్ చేసి తాగేయాలి ఈ జ్యూస్ చెక్కర స్థాయిల్ని అదుపులో వుంచుతోంది.

Leave a comment