కొంత మంది బాగా సన్నగా వుంటారు. అలాంటప్పుడు చక్కని చీర కట్టుకోవాలంటే మీద సన్నగా కనిపిస్తామని భయపడతారు. కాటన్ కు బదులు లెనిన్ చీరలు ఎంచుకుని లేదా ఆర్గెంజా షిఫాన్ వంటి చీరల్లో కుడా చెక్కగా పొడవుగా కనిపించేలా చేస్తాయని చెప్పారు డిజైనర్స్. చీరను కొంచెం నడుము కిందగా కట్టుకోవాలి. చెప్పులు వేసుకుని కుచ్చిల్లు అందంగా వస్తాయంటారు. చీర కు కాంట్రాస్ట్ గా వుండే బ్లవుజ్ వేసుకోవాలి. ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్స్ కోసం ఉప్పాడ, గద్వాల్, కంచి పట్టు చీరలు పెద్ద అంచులున్నవి ఎంచుకొంటే చక్కగా ఉంటాయి. బ్లావుజు మోచేతి వరకు గుండ్రని మేడా, కీహాల్ తరహావి ఎంచుకుంటే బావుంటుంది. సాధారణంగా చీర ఒక్కటే అన్ని తరహాల శరీర నిర్మాణం ఉన్నవాళ్ళకి చక్కని మాచింగ్ అలాగే బుజం పై పెన్నీలు పెట్టి చీరను అలా స్టిఫ్ గా ఉంచకుండా మోచేతుల పైకి చీరను జారిస్తే ఇంకా బావుంటుంది. పెద్ద ప్రింట్లు కుడా చక్కగా ఉంటాయి.

Leave a comment