చిరుత పులుల సంరక్షణ కోసం సూరత్ సమీపంలో ఉండే మాండ్వీ అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళ దళం పనిచేస్తోంది. కొత్త చిరుత కనిపిస్తే దాన్ని పట్టుకుని వాటి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చటం కూడా వీళ్ళ పనే మాండ్వీ భిల్లుల సామ్రాజ్యం ఇక్కడ 50 వరకు పులులున్నాయి. గ్రామస్తులు పులులను చంపేయకుండా మహిళా దళం కాపాడుతోంది. గత సంవత్సరం కాలం లోమేము 22చిరుతలు పట్టుకొని వాటికీ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లను అమర్చాము. ఇంకా 20 లేదా 30 చిరుతలకు ఈ ట్యాగ్ లు అమర్చాలి వాటిని కాపాడాలంటే వాటి కదలికలు నిరంతరం తెలిసే ఈ ఫ్రీక్వెన్సీ ట్యాగ్ అమర్చాలి అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజ సింగ్. చిరుతల కోసం ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పనిచేయటం స్ఫూర్తిదాయకం.

Leave a comment