చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం, తేనే మిశ్రమంలో చక్కర కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే చర్మం కాంతిగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఫేస్ మాస్క్. వేడి నీళ్ళలో నిమ్మరసం, చక్కర కలిపి ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమం చర్మం పైన అప్లయ్ చేస్తే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా షుగర్ తో స్క్రబ్ చేసుకొంటే వృద్ధాప్య ఛాయలు రానివ్వదు. చక్కెరలోని గైకోనిక్ ఆసిడ్ చర్మం ద్వారా వెళ్లి దుమ్ము వల్ల ఏర్పడే మొటిమలు, మచ్చలు రాకుండా శుభ్రం చేస్తుంది. పెదవులకు లిప్ గ్లాన్ లాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో కాస్ట్రో షుగర్ వేసి పెదవులపైన సున్నితంగా మర్ధన చేస్తే పెదవులు పొడిబారటం వుండదు. కప్పు వేడి నీళ్ళలో స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ పంచదార కలిపి జుట్టుపైన స్ప్రే చేసి కాసేపాగి స్నానం చేస్తే మెత్తగా నిగనిగలాడుతుంది.

 

Leave a comment