ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే కెమికల్స్ వల్ల కూడా ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి గాలి ధారాళంగా రాణి లోపల గదుల్లో ఈ కెమికల్స్ వినియోగంతో సమస్యలు వస్తాయి.అలాగే ఇంటి ఆవరణలో పెంచే కూరగాయల మొక్కల పై కూడా ఫెస్టిసైడ్స్ వాడకూడదు. బద్దంకలు చీమలు కోసం ఉపయోగించే స్ప్రే కారణంగా పిల్లల్లో ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం గది మూలల్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలి గదిలో కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు మార్కెట్లో దొరుకుతాయి.ఇప్పుడు మంచి గాలి కోసం ఇండోర్ గార్డెనింగ్ చాలా అవసరం పిల్లలు పెద్దలు ఇప్పుడు ఎక్కువ సేపు ఇళ్లలోనే గడుపుతున్నారు.ఇంట్లో సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సూర్యకాంతి చాలా అవసరం.

Leave a comment