ఎయిర్ టెల్ మారథన్ లో 42 కి.మీ దూరాన్ని 4 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేసింది జయంతి పండత్ కుమార్. తమిళనాడులో పుట్టిన జయంతి హైదరాబాద్ లో మైక్రో సాప్ట్ లో మానవ వనరుల విభాగంలో మెనేజర్ గా పని చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడోద్దని ప్రచారం చేస్తున్నారు. చేనేతను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మారథాన్ లో నేత చీరతోనే పాల్గొంది జయంతి. వారంలో మూడు రోజులు పది గంటలపాటు పరిగెడుతూనే ఉంటుందట. వయసు నలభై సంవత్సరాలు ఉదయాన్నే లేవడం శాఖాహారం మాత్రమే తినడం పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం, బ్రౌన్ రైస్,గోదుమ పదార్ధాలు తినడం,పాటలు పాడుకుంటూ పని చేయడం, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండమని ప్రచారం చేయడం జయంతి చేస్తున్న కార్యక్రమాలు. ఈమెకంటే గొప్ప రోల్ మోడల్ ఎవరుంటారు.

Leave a comment