నీహారికా,

ఒకప్పుడు పిల్లలకు కధలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటంలేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కధల్లో చెప్పాలి. సత్యం పలకమనో, పెద్దవాళ్ళను గౌరవించమనో, ఇరుగు పొరుగును ప్రేమించమానో, స్టేట్మెంట్స్ లా చెప్పితే ఎలా తెలుస్తుందని వాళ్ళకు మంచి విలువలు సందేశాలు నేర్చుకోవాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఓ ఊహాలోకాన్ని తెరిచి పెట్టాలి. మనం చెప్పే నీటిని అందమైన కధతో జోడించి చెప్పితే వాళ్ళ చిన్ని మెదడుకు ఆ సందేశం అందుతుంది. ఎన్నో పరిశోధనలు ఈ విషయాన్ని గట్టిగా చెప్పుతున్నాయి ఐదారెళ్ళ పిల్లలకు మనుషుల బొమ్మల కంటే జంతువుల బొమ్మలు ప్రధాన పాత్రలుగా చేసి కధలు చెప్పితే ఇష్టంగా వింటారు. సామాజిక సేవా మంచి ఆలోచనలు మంచి అలవాట్లు నేర్పలంటే కదల ద్వరానే అలవాటు చేయాలి కదా మంచి మాధ్యమం.

Leave a comment