ముంబై మహిళ మనా షా వినూత్నమైన ఆలోచన తో ముంబైలోని చెత్త సమస్యకు ఒక పరిష్కారం చూపించింది. ఏ వీధిలో చూసినా కుప్పలుగా పేరుకుపోయిన చెత్త ఆమెను బాధపెట్టింది. 2010 గ్రీన్ ప్రాక్టీసెస్ అనే సంస్థను ప్రారంభించి వివిధ కాలనీలోని చెత్తను సేకరించి కంపోస్టు తయారీకి రూపకల్పన చేసింది. కొన్ని వందల మందికి ఈ పనితో ఉపాధి దొరికింది. కాలనీలు, హౌసింగ్ సొసైటీల నుంచి చెత్తను సేకరించినందుకు ఇంటికి 100 రూపాయలు చార్జీ చేసిందీ సంస్థ.సేకరించిన చెత్తతో మొక్కలకు పనికి వచ్చే ఎరువు తయారు చేసి దాని ఆ కుటుంబాలకే పంచుతారు.ఆమె కృషితో ప్రస్తుతం నెలకు 500 టన్నుల చెత్త ఎరువు గా మారుతుంది.