చిన్నప్పుడు పిల్లలకు చేయించే మెట్ల మొదటి నగ మొదట్లో మురుగు. ఆడపిల్ల మొగపిల్లలు ఎవరు పుట్టినా ఈ సాదాగా గుండ్రంగా వుండే మురుగుని అలంకరించేవాళ్ళు . ఇప్పుడు ఇంకెన్నో కొత్త డిజైన్లు వస్తున్నాయి పాపాయిల కోసం. పాతకాలపు దిష్టి పూసల్లాగా నల్ల పూసలు నల్లారి క్రిస్టల్స్ బంగారపు తీగను కలిపి ఎన్నో డిజైన్లు తయారవుతున్నాయి . బేబీ బ్రేస్లెట్లు బేబీ బ్యాంగిల్స్ సాదా బంగారమనీ రాళ్ళూ వజ్రాలు పొడిగినవీ వస్తున్నాయి . వైట్ గోల్డ్ కలిసినవీ వచ్చాయి . పిల్లలు పెరిగేకొద్దీ అడ్జస్ట్ చేసుకునేలాగా అడ్జెస్టబుల్ మురుగులు వస్తున్నాయి . అలాగే మురుగు ఉంగరం కలిపి ఎటాచ్డ్ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. ఇవి కొత్త పాతల సమ్మేళనం. పిల్లల పట్ల పెద్దవాళ్ళకుండే మమకారాలు సంకేతం. ఇంట్లో పాపాయి రాబోతుంటే ఈ డిజైన్స్ కోసం చూడండి.

Leave a comment