డూడ్ లేజ్ బ్రాండ్ తో పరిశ్రమల నుంచి వృధాగా వదిలేసిన వస్త్రంతో ఆధునికమైన ట్రెండీగా కనిపించే డిజైన్ లతో బ్రాండ్ స్టోర్స్ లో దొరికే దుస్తులకు ధీటుగా అద్భుతమైన డ్రెస్ తయారు చేసి లక్మే ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించింది కృతీ తుల. పెద్ద సంస్థల్లో ప్రింట్ లో తప్పులు వచ్చినా లేదా రంధ్రాలున్నా కటింగ్స్ లో తేడాలున్నా ఆ వస్త్రాలను పక్కన పెడతారు. అలా నిరుపయోగంగా పేరుకుపోయిన  వస్తువులను సేకరించి ఒక మంచి వ్యాపారం ప్రారంభించింది కృతి తుల. డిజైనింగ్ లో ఎం.ఏ చేసిన కృతి డిజైన్ చేసిన వస్త్రాలు మెయిన్ స్టోర్స్ లో అందరిని ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ లో అనానిమ్, జగాన్, తగుర్ ప్రాజెక్టు వంటి స్టోర్సు లో కృతి తుల డిజైన్స్ దొరుకుతాయి.

Leave a comment