చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా.

Leave a comment