కొందరికి డబల్ చిన్ సమస్య ఉంటుంది. అదనపు శారీరక కొవ్వుతో ఈ సమస్య వస్తుంది. సాధారణంగా బరువు తగ్గితే డబల్ చిన్ మాయం అవ్వుతుంది. కొన్ని సార్లు వారసత్వంగా కూడా ఈ సమస్య వస్తుంది. పుట్టుకతో వచ్చిన దాని విషయం అలా ఉంచితే ఎవ్వరైనా సరే ఒక్క చిన్న చిట్క పాటించ వచ్చు. షుగర్ ఫ్రీ గుమ్స్ ని ఎంచుకుని అలవాటుగా నములుతూ ఉండాలి. చ్యూయింగ్ గమ్ నమలడం వల్ల చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. నోరు విశాలంగా తెరిచి నాలుక బయటకు చాచి చుబుకాన్ని కిందకు సాగదీస్తున్నట్లు పది లెక్కపెట్టేదాకా అలాగే అలాగే ఉంచాలి. ఇలా రోజుకు పది సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. పాలల్లో గ్లిసరిన్ కలిపి మాస్క్ లాగా వేసుకుని రాత్రంతా వదిలేస్తే ఫలితం కనిపిస్తుంది. గ్లిజరిన్ అద్భుతమైన సెల్యులైట్ రిమూవర్ గా పనిచేస్తుంది.

Leave a comment