బ్లాక్ ఎన్డ్‌ వైట్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. వానా కాలానికి సూటయ్యే రంగు నలుపేనంటారు ఫ్యాషన్ నిపుణులు. హీరో తనానికి హోదా కి ప్రతీకగా ఉండే నలుపుని చక్కని ప్రకాశవంతమైన శాంతికి రూపమైన తెలుపుతో జోడిస్తే ఎంతందం. కొత్త దనానికి స్థిర చిత్తానికి, ఆశావాదానికి తెలుపు సంకేతం అంటారు. తెలుపు నలుపుని క్లాసిక్ కలర్ కాంబినేషన్ అంటారు ఫ్యాషన్ గురూలు. నగలు,దుస్తులు,వాహనాలు చివరకు ఇంటీరియర్స్ లోనూ ఈ కాంబినేషన్ బావుంటుంది. ఈ రెండింటిని కలిపి ధరించడం తిరుగులేని ఫ్యాషన్ ముఖ్యంగా వర్షకాలపు చినుకుల్లో చీకటి వెలుగుల్లా.

Leave a comment