హీలింగ్ లిటిల్ హార్ట్స్ పేరుతో 132 మంది గుండె జబ్బులున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స లు  చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుపమ నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్య నాదెళ్ల శ్రీమతి అనుపమ అమెరికాలోని ప్రఖ్యాత సియాటిల్ పిల్లల ఆసుపత్రి పరిశోధన కేంద్రం కోసం గత కొన్నేళ్లుగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఇట్ స్టార్ట్ విత్ ఎస్ పేరుతో ఆస్పత్రి సేవల పై అవగాహన తీసుకురావటం తో పాటు నిర్మల సమీకరణ చేస్తున్నారు కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు కోట్ల రూపాయలు అందించారు అనుపమ. అనంతపురం ,ఛతీస ఘడ్  సహా పలు ప్రాంతాల్లో మహిళలు పిల్లల కోసం కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Leave a comment