ఫ్రీ స్కూల్ నుంచి మాములు స్కూలుకు చేరే వయసు ఉన్న పిల్లలకు సొంతంగా వాళ్ళు తినగలిగే ఆహారం ,అలవాటు చేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్. డైటీషియన్ లు సిఫారసు చేసిన ప్రకారం ఉదయం ఒక కప్పు పాలు ,గుడ్డు ,ఇడ్లీ ,దోశ వంటి అల్పాహారం పెట్టాలి ,మధ్యాహ్నం ఆకు కురలు ,కూరగాయలు వేసి చేసిన ప్లేవర్డ్ రైస్ లేదా పప్పులు చేసిన కిచిడీ కూర తో పాటు రోల్స్ లా చేసిన చపాతీలు మంచివి . సాయంత్రం కప్పు పాలు స్నాక్స్ పళ్ళు ,బఠానీలు శెనగలు వేరుశెనగ పప్పు ,మరమరాలు ,అటుకులు ఇవ్వాలి . రాత్రి భోజనంలో అన్నం ,చపాతీ కొంత కూర ,పెరుగు ,మజ్జిగ ఇస్తే సరిపోతుంది . నూనెతో చేసిన చిరుతిండ్లు బిస్కట్స్ ,చిప్స్ ,కూల్ డ్రింక్స్ ,ఐస్ క్రీం వంటివి నెలకు ఒకటి రెండు సార్లకు మించకూడదు . వాళ్ళ కు ఒక గంట సేపయినా ఆడుకొనే అవకాశం ఇవ్వాలి .

Leave a comment