ఒక సర్వే రిపోర్టు పిల్లలు తమ చేతికి ఇచ్చే పాకెట్ మనీలో 85శాతం బయట తిండికే ఖర్చు పెడుతారని చెపుతుంది. పెద్ద వాళ్ళు ఇందు గురించి బాధపడి వాళ్ళను దండించే కన్నా ,బయట వాళ్ళు తినే ఫుడ్ ఇంట్లోనే కాస్త వెరైటీగా తయారు చేసి ఇవ్వచ్చు అంటున్నాయి అధ్యయనాలు. పిల్లలు వచ్చే సరికీ వాళ్ళకు దోసెలు, ఇడ్లీలు పెడతననకుండా ఇంట్లోనే ఉడికించిన వేరు సెనగలు చనాబాట్ మొక్కజొన్న వంటి వాటితో చక్కని స్నాక్స్ చేసి ఇవ్వచ్చు. బయట వాళ్ళు తినేవి ఇవే. తాజా పండ్ల రసం వడకట్ట కుండా తీసి రేడీగా ఉంచవచ్చు. ఆర్గానిక్ హాల్ గ్రెయిన్ ప్లాక్ ,బెల్లం తేనే బ్రౌన్ షుగర్ తీసి లేసి కోకో పౌడర్ వాడి బేకరీ ఫుడ్ ఐటమ్స్ నేర్చుకొని చేసిపెట్టవచ్చు . సాస్ లు జామ్ లు ఇంట్లో కూడా తయారు చేయవచ్చు. పండ్లు ,డ్రైఫుట్స్ ఉపయోగించి చక్కని బేకరీ ఐటమ్స్ చేయవచ్చు. ఆర్గానిక్ ,కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్స్ ఉపయోగించి పిల్లలను బజార్లో దొరికే ప్రతి ఐటమ్ ఇంట్లో వండవచ్చు. బోలెడన్ని కుకింగ్ క్లాసెస్ ఆన్ లైన్ లోనే ఉన్నాయి.

Leave a comment