చెట్టునిండా చిలుకలు వాలితే ఎంత సందడి,ఎంత అందం . కానీ ప్రకృతి ఎంత తమాషా చేసిందంటే ఏకంగా చిలుకలు వాలినట్లుండే మొక్కనే సృష్టించింది . చూస్తే మొక్కపైన వాలిన చిలుకలు కనిపిస్తాయి . ఈ మొక్కపేరు క్రోటలేరియా కనింగ్ హామీ లేదా గ్రీన్ బర్డ్ ఫ్లవర్ ప్లాంట్ అంటారు . ఈ చెట్టుకు పూసే పువ్వులు ఆకుపచ్చ రంగులో హమింగ్ బర్ద్ మొక్క రెక్కలు తగిలించు కొన్నట్లు అచ్చం పక్షి పిల్లలాగే ఉంటుంది . హటాత్తుగా ఫోటో చూసినా చిలకలాగే కనిపిస్తాయి . ఆస్ట్రేలియాకు చెందిన ఈ మొక్కలు ఉష్ణప్రాంతంల్లో పెరుగుతాయి . ఈ పువ్వు పిట్టల ఫోటో చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది .

Leave a comment