మొదటి సారిగా మా నాన్న దర్శకత్వంలో పని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఒక అందమైన ఉద్వేగా భరితమైన ,ఒక అపారమైన అంటే ఒక అంతు దరి కనిపించనంత పెద్దది అనుకొండి. అలాంటి పర్వతాన్ని ఎక్కబోతున్న చిన్న ఎలుక లాగా ఉన్నాను నేను అంటుంది అలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో నడక-2 షూటింగ్ మొదలైంది. నేనా పర్వత శిఖరాన్ని అందుకోగలననే భావిస్తున్నాను. కానీ అదంత సులువు కాదని నాకు తెలుసు. కానీ మధ్యలో పడిపోయినా పుంజుకోగలనన్న నమ్మకం ఉంది అంటోంది అలియా భట్. ఎంతైన తండ్రి దర్శకత్వంలో నటించటం కదా!

Leave a comment