రోజు మొత్తం శరీరానికి చిన్న పాటి కదలికలు ఉండేలా చూసుకుంటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు స్విజర్లాండ్ పరిశోధికులు. శరీరానికి మంచి వ్యాయామం ఇవ్వాలంటే వాకింగ్, జిమ్ మాత్రమే అనుకోకూడదు రోజు మొత్తం శరీరానికి ఎంతో కొంత చురుకుదనం ఇచ్చేలా అనేక అవకాశాలు ఇమ్మంటున్నారు. ఈ చిన్న మార్పులు గుర్తించ దగిన ఫలితాలు ఇస్తాయంటే అది ముమ్మాటికీ నిజం అంటున్నారు. వీధి చివరి వరకు ఆలా నడిచి రావటం,మెట్లక్కటం సైకిల్ పైన వెళ్ళటం ఇవన్ని ఒక రకం వ్యాయామం. ఇది ఏ అర గంటకు పరిమితం చేయకుండా రోజంతా,మెలుకువగా ఉన్న సమయంలో పనిలో ఉన్నా సమయంలో కూడా శరీరాని కాస్త కదల్చి నాలుగు అడుగులు వేస్తువుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోంది అంటున్నారు.

Leave a comment