భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని  ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి నచ్చవంటే నేను నమ్మలేను. అనేసారు. ఆయనే ఇంత ఆలోచనారహితంగా మాట్లాడితే అమ్మాయిల రక్షణ ఏకంగా ఆ నగర పరిస్థితిని మేయర్ వ్యాఖ్యలకి ఎలా ఊహించాలి. అడుగడుగునా వేధింపులే. వెంబడించటాలు. చివరికి మేయర్ వ్యాఖ్యలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నగరం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అమ్మాయిల పై వేధింపులే కాదు. వాళ్లకి నచ్చని మాట విసిరినా చాలు 3600 రూపాయల జరిమానా. వాళ్ళ భాషలో వెయ్యి పెసోలు. ఇందుకు కారణం అక్కడ మొదలైన ఒక ఉద్యమంNi Una Menos అంటే ఇంకొక్కరికి ఇలా కాకూడదు అని ఉద్యమ ఫలితమే ఇప్పటి చట్టం.

Leave a comment