Categories

ఒక చిన్న చిరునవ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్నే మార్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. ఇది మానసిక ప్రయోజనాలనే కాదు, సామాజిక బంధాలు బలపడటం లోను కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరులకు మనపై నమ్మకం కలిగేలా చేసేది ఈ చిరునవ్వే అంటారు. ఎదుటివారిని చూసి చిన్న నవ్వు నవ్వితే నేను మీతో స్నేహపూర్వకంగా ఉంటాను, నాతో ప్రమాదం లేదు, నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అనే పాజిటివ్ సంకేతం ఎదుటి వాళ్లకు వెళుతుందట ఇతరుల నమ్మకం సంపాదించాలంటే పెదవుల పైన చిరునవ్వు ఉంటే చాలు.