గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే సంభాందిత మందులలో లోపాలు లేకుండా ఉండేందుకు ఒక్క ఫోలిక్ యాసిడ్ మాత్రమే ఇస్తారు. ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఎంటటే ఈ సమయంలో సోంత వైద్యం చేయక పోవడం మంచిది. భారతీయ మహిళలలో జీవనశైలిలో ఎక్కువగా విటమిన్ డి,క్యాల్షియం తక్కువగా ఉండి ఎముకలు బలహీనంగా ఉంటాయి. శారీరక ఫీట్ నెస్ చాల తక్కువ ఈ సమయంలో ఎక్కువ యోగా,వ్యయామం  చేయాలి. సరైన పోజిషన్ లొ కుర్చుని,నిలబడాలి.చాలినంత విశ్రాంతి,నిద్ర ఉండాలి.సౌకర్యాంగా ఉండే పరుపు పైన ఎదో ఒక వైపు తిరిగి పడుకోవాలి. అమ్మతనాన్ని అమ్మగా ఆస్వాదిస్తు డాక్టర్ల నుంచి సలహాలు,సూచనలు తీసుకొంటు ముద్దులు మటగట్టే పాపాయి ని ఈ లోకంలొకి  తీసుకురావలి. గర్భవతి కాగానే డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుని పరీక్ష లు చేయించుకోవాలి.

Leave a comment