ప్రతి సంవత్సరం 25 లక్షల మంది మన దేశంలో ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. 194 మిలియన్ల మందికి డైలీ భోజనం లేనే లేదు.
వందలో నలుగురు పిల్ల్లలు పోషకాహార లోపంతో చావుకు దగ్గరవుతున్నారు. ఎన్ని చేతులు భోజనం కోసం చేతులు జాపి వేడుకుంటున్నాయో. ఢిల్లీలోని గురుగ్రామ్ లో పన్నెండో తరగతి చదువుతున్న అర్జున్ సహాయ్, జెస్సీ జిందాల్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో freedom.in సంస్థను ప్రారంభించారు. గురుగ్రామ్ లోని కెఫ్ లో , రెస్టారెంట్ లలో మిగిలిన ఆహారాన్ని తాజాగా ఇమ్మని కోరి అలా సేకరించిన ఆహార పొట్లాలను మురికి వాడల్లో, ఆస్పత్రుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పంచుతున్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబైల్లో వారి సంస్థ పని చేస్తుంది. అర్జున్ కంప్యూటర్ ఇంజనీర్ , జెస్సీ డాక్టర్ కావాలని శ్రద్ద్దతో చదువుతునే శ్రద్దతో ఈ సంస్థ నడిపిస్తున్నారు.