చినుకులు రాలే వర్షాకాలంలో పూవ్వుల ప్రింట్స్ ఉన్నా దోస్తులు బెస్ట్ ఎంపిక అంటుంది ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా. ఈ రోజుల్లో ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, గులాబీ, నీలం రంగుల్లో లైక్రా లేదా పాలిస్టర్ వంటి ఫాబ్రిక్ లు ధరిస్తే బావుంటాయి. అవి ముడతలు పడకుండా సులభంగా పొడిగా అయిపోతాయి. పలాజోలు బాటమ్ గా విశ్రాంతిగా ఉంటాయి. ప్రింటెడ్ ఆర్గాంజాలు సిల్క్ డ్రెస్ లు బాగుంటాయి. ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ ఏవైనా సరే చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకోవాలి. ఏదైనా వేడుకలకు తేలికగా ఉండే సిల్క్ లెహంగా కు పెద్దపెద్ద బోర్డర్ లు చక్కని గ్లామర్ లుక్ ఇస్తాయి అంటోంది  మసాబా.

Leave a comment