చీరెల్లో ఎప్సుడు అందంగానే కనిపిస్తారు .కొత్తగా చీరె కట్టుకోవటం ప్రయత్నించే అమ్మాయిలు కొన్ని చిట్కాలు పాటిస్తే చీరెలో నాజుగ్గా కనిపించవచ్చు. కాస్త బొద్దుగా ఉంటే లేత రంగుల్లో తక్కువ డిజైన్ చీరెలు ఎంచుకోవాలి. శరీరానికి అతుక్కునేలా జార్జెంట్ ,శాటిన్ , క్రేప్ షిఫాన్ వంటి తేలికగా ఉండే వస్త్ర రకాలను ఎంచుకోవాలి. స్లిమ్ ఫిల్ పెటీకొట్ ను చీరెకు జతగా ఎంచుకోవాలి. పొడవాటి చేతులున్న బ్లౌజ్ వేసుకోంటే సన్నగా అనిపిస్తారు. కుచ్చుళ్ళు క్రమ పద్దతిలో పెట్టుకోవాలి. స్లీవ్ లెస్, ఆప్ ఫోల్డర్స్, కేప్ బ్లౌజ్ లు ప్రత్యేక సందర్భాల్లో ఎంచుకోవాలి. ఇప్పుడు బరువైన పట్టు చీరెలు కూడా చాలా తేలికైన రకాలుగా వస్తున్నాయి. పల్చని ,బరువు లేని కాటన్ రకాలు విస్తారంగా ఉన్నాయి కనుక చీరెలు కట్టుకోవటం నేర్చుకొంటే మంచిదే.

Leave a comment