చిరుతిండి తో బరువు పెరుగు తామనే భయం చాలామందిలో ఉంటుంది . కానీ ఆరోగ్య పూరితమైన తక్కువ క్యాలరీలున్నా చిరుతిండ్లు ఆకలిని దూరంగా ఉంచేందుకు మంచిమార్గాలు అంటారు డైటీషియన్లు . ఇవి శారీరక కొవ్వును ,రక్తంలో చక్కర స్థాయి లకు తగ్గిస్తాయి . తక్కువ క్యాలరీలు,ఎక్కువ పీచు లేదా ప్రోటీన్ ఉన్న పదార్దాలు తినటం వల్ల సంతృప్తి కరమైన భావన కలుగుతుంది . తర్వాత భోజనం గురించిన ఆతృత తగ్గుతుంది కొవ్వుకరుగుతుంది . బ్రేక్ పాస్ట్ ,లంచ్ ,డిన్నర్ లకు అదనంగా మిడ్ మార్నింగ్ ,ఈవీనింగ్ స్నాక్స్ తీసుకోవటం తో పాటు రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో,ఎసిడిటి సమస్య నివారణలో ఉపకరిస్తుంది . ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు ఎక్కువగా తినచ్చు .

Leave a comment