ఫ్యాషన్ అది ఏదైనా కానీ ఎవరో ఒక్కరు సరదాగా ఏదైనా చేసినా, అది ఇంకో పది మంచి భలే వుందిఅన్నారంటే చాలు అప్డేట్ అయ్యిపోతుంది. అది బావుందీ, అందం ఇస్తుందీ, కానీ ఫేస్ బుక్ లోనో సోషల్ మీడియాలోనో వైరల్ అయిందా లేదా? ఇదిగో అలా వచ్చిందే లెపడ్ ప్రింట్ హెయిర్ స్టైల్. ప్రస్తుతం యుకెలో హాల్ చల్ చేస్తున్న ఈ ఫ్యాషన్ ఇండియాలోకి వచ్చి వాలిందో లేదో మరి ఇప్పుడు అక్కడి అబ్బాయిలు, అమ్మయిలు చిరుత పులి వంటి పై వుండే చుక్కల్ని తలపై డై వేయించుకుని చిరుతల్లాంటి వాళ్ళమని చెప్పకుండా చెపుతున్నారు. చీతా చుక్కలు తలపై డిజైన్ చేయిస్తే ఎలా వుంది అనే లోగానే ఈ ట్రెండ్ పాప్యూలర్ అయిపోయి సెల్ఫిలు తీసుకుని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు అమ్మాయిలు అబ్బాయిలు. ఈ చిరుత ట్రెండ్ ఎంత కాలం వుంటుందో  వామో అర్జెంట్ గా ఫోటోలు చూసేయండి.

Leave a comment