వంట సోడా తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ వంటసోడా వేసిన నీళ్ళలో పండ్లు కూరగాయలు కడిగితే వాటికి అంటిన దుమ్ముతో పాటు పురుగుల మందులు కూడా పోయి శుభ్ర పడతాయి దుమ్ము పట్టిన కార్పెట్ల మీద వంటసోడా చల్లి వేడి నీళ్లతో రుద్దితే కార్పెట్ల లోని దుమ్ము ధూళి పోతాయి.గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది శరీరం నుంచి వచ్చే చెమట వాసన పోతుంది. నీళ్లలో వంటసోడా వేసి చంకల్లో రాసుకుంటే చెమట వాసన రాదు. రసాయనాలతో నిండిన ఎయిర్ ఫ్రెష్ నర్స్ కంటే వంటసోడా బాగా ఉపయోగపడుతుంది.కాస్త ఎసెన్సియల్ ఆయిల్ లో వంటసోడా కలిపి ఇంట్లో చల్లితే సువాసన వస్తుంది.

Leave a comment