జర్నీ తో టాలీవుడ్ కు వచ్చినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తోనే  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంజలి. ఇప్పుడు ఆమె నటించిన చిత్రాంగద రాబోతోంది. తమిళంలో యార్నీ  పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అంజలి చాలా సంతృప్తి వుంది. తెలుగులో పాటు తమిళంలో కూడా అంజలి ఓ పాట  కూడా పాడింది. టైటిల్ పాత్రలో ఈమె చాలా బావుందిట. గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా కధే ఎంతో మంచిది. ఇంతకు ముందు ఇలాంటి సినిమా రాలేదంటోంది అంజలి. ఈ హారర కామెడీలు ఇంతవరకు తెలుగులో చూడని దృశ్యాలుంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పడూ తమిళంలో మూడు కన్నడంలో సినిమా చేస్తున్నాను. కానీ ఎంతో మంచి తెలుగు అమ్మాయిలు ఫీల్డ్ లో ఉంటే దర్శక నిర్మాతలు వాళ్ళ గురించి పట్టించుకోరని వస్తోంది. లేకపోతే ఉత్తరాది యాక్టర్స్ మనకెందుకు? తెలుగు అమ్మాయిలంటే టాలీవుడ్ వాళ్ళకి కాస్త చిన్న చూపు. అందుకే తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ బాట పడుతున్నారంటోంది. అంజలి. నిజమే అభినయం అందం ఉన్నావన్న అంజలికి తెలుగు సినిమా లెందుకు లేవు.

Leave a comment