శ్రీ  ఆంజనేయం ప్రసన్నాంజనేయం
   మహా దివ్య కాయం భజేహం భజేహం!!
ఆంజనేయుడు అంటే గంభీరమైన వానరుడని భయాందోళనలతో ఉన్నప్పుడు తలచుకుంటాము.”సంజీవ”పర్వతాన్ని అతి సులభంగా తెచ్చిన బలశాలి మరి.
ఆంజనేయ స్వామి మనకు అన్ని రకాలుగా దర్శనం ఇస్తాడు.ముఖ్యంగా పిల్లలకు “చిట్టి ఆంజనేయ స్వామి “రూపంలో ప్రత్యక్షమవుతాడు.ఆయనకు పిల్ల భక్తులంటే
ప్రాణం.చిట్టి ఆంజనేయుడు పిల్లలకు ఒడి దుడుకులు లేకుండా, దుష్ప్రభావాల బారిన పడకుండా,ఆరోగ్య సమస్యలు లేకుండా మరి
వారి వెంటే ఉంటాడు.ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి మూడు,ఐదు లేదా పదకొండు తమలపాకుల దండ వేస్తే పిల్లల గల ఇంటికి ఎంతో మేలు.గుడిలో దేవుని వద్ద సింధూరం తప్పకుండా పెట్టుకోవాలి. ఎంతో శక్తివంతమైనది.హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

ఇష్టమైన రంగులు:సింధూరం
ఇష్టమైన పూలు: మల్లె పూల దండలు
చిట్టి ఆంజనేయ స్వామి నిత్య ప్రసాదం: చిట్టి గారెలు, చిట్టి అప్పాలు,కొబ్బరి,అరటిపళ్ళు.

చిట్టి గారెలు: ముందు రోజు మినప్పప్పు నానబెట్టి,మరుసటి రోజు ఉదయం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, పచ్చి మిరపకాయల కారం వేసి, నూనె వేడి చేసి చిట్టి చిట్టి గారెలు వేసుకుంటే సరి.

చిట్టి అప్పాలు:బెల్లం నీళ్ళలోవేసి కరిగిన తరువాత పాకం తయారు చేసి దానిలో బియ్యం పిండి వేసి యాలకు పొడి కలిపి చిట్టి చిట్టి అప్పాలు చేసి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అంతే ప్రసాదాలు సిధ్ధం!!
        “జై భజరంగ్ బలి కి జై”!!

      -తోలేటి వెంకట శిరీష  

Leave a comment