జుట్టు కూడా ఆరోగ్య సమస్యల గురించి చెపుతుంది అంటారు డాక్టర్లు . కొన్ని అసాధారణ మార్పులు కనిపిస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోమంటున్నారు . కొందరికి జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటాయి . ఇది పోషకాహార లోపం వల్ల జరుగుతుంది అంటారు . ధైరాయిడ్ లో హెచ్చుతగ్గులు ఉన్న ఈ సమస్య రావచ్చు . అంచేత ఆహారంలో ప్రోటీన్లు కెరోటిన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి . ధైరాయిడ్ లోపాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి . జుట్టు చివర్లు చిట్లుతూ ఉంటే మాత్రం డాక్టరు సలహా కోసం వెంటనే వెళ్ళాలి .

Leave a comment