ఎవ్వరి కైనా ఫేవరెట్ చాక్లెట్. అది తినేందుకే కాదు సౌందర్య పోషణలోనూ ముందుంటుంది. చాక్లెట్ తో చక్కని ప్యాక్ వేసుకోవచ్చు ముందుగా చాక్లెట్ ని కరిగించాలి. అందులో స్పూన్ తేనె, కోడిగుడ్డులోని తెల్ల సొన, నిమ్మరసం వేసి బాగా గిలక్కొట్టాలి మొహం మెడ చేతులకు ప్యాక్ లాగా వేసుకోవాలి. పావుగంట ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే చాక్లెట్ లో కోడిగుడ్డు, తెల్లసొన ఐదారు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.

Leave a comment