ఈ లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకోవాలంటే చూడవలసిన సినిమా మంచి సినిమా చొకేడ్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిమానిటైజేషన్ సమయంలో జరిగే అవకాశం ఉన్న చక్కని సినిమా.సవిత ఒక సాధారణ గృహిణి.లోకల్ బ్యాంక్ లో క్యాషియర్ ఒక కొడుకు,గిటార్ వాయించడం తప్ప సంపాదన తెలియని భర్త.చుట్టూ అపార్ట్మెంట్ మిత్రులు ఈ పాత ఫ్లాట్ లో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి సవిత ఇంట్లో డ్రైనేజ్ పైప్ లోంచి ప్లాస్టిక్ పోట్లలో చుట్టిన డబ్బు పైకి వస్తుంది. ప్రతి రాత్రి అలా డబ్బు వస్తూ ఉంటుంది. భర్త  కు  కూడా చెప్పదు ఈ విషయం. ఆ ఫ్లాట్ లో  ఉండే ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఎమ్మెల్యే అక్రమ సంపాదన దాచి పెడుతూ అందులో కొంత కాజేసి ఈ డ్రైనేజ్ లో దాసు ఉంటాడు. అది కాస్త సవిత చేతికి వస్తుంది. అలా వచ్చిన డబ్బు ఈ మధ్య తరగతి గృహిణి జీవితంలో తెచ్చిన ఒక తమాషా ఈ చిత్రం తప్పకుండా చూడండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Leave a comment