జానకి కేరళ ప్రాంతపు మారుమూల గ్రామంలో అమ్మాయి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా స్కూలు ఎగ్గొట్టి తన ప్రేమికుడితో సిటీ చూసేందుకని వస్తుంది. అతను తన బాస్ తో సహా జీపు తీసుకొస్తాడు. జానకి మూడో వ్యక్తిని చూసి భయపడుతుంది. ప్రేమికుడు బాస్ తెలిసినవాడే భయం లేదని ఒప్పిస్తాడు సిటీలోని జన సందోహపు రోడ్డు ఆకాశ హర్మ్యాలు చూసి ఆనంద పడుతోంది జానకి. ఆమె స్నేహితుడిని బయటికి పంపి జానకిని బలత్కారిస్తాడు బాస్ కన్నెత్వాన్ని కాజేసే వాడే ఆమె జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి అన్న సాంప్రదాయపు కథలు విన్న జానకి తనను రేప్ చేసిన వాడినే అనుసరిస్తుంది. ఆమె ప్రేమికుడు ఆమెను ఆపలేక పోతాడు. జోజు జార్జ్,నిమిషా సజయన్ ఇద్దరు జాతీయ బహుమతులు అందుకొన్న ప్రతిభావంతులైన నటులు సినిమాలో చాలా బాగా చేశారు.

Leave a comment