జీవన శైలి సమస్యల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవటం ఒకటి అది ఎక్కువైతే హుద్రోగాలు మధుమేహం ,కాలేయ సమస్యలు వస్తాయి . ఈ కొవ్వు ఏ స్థాయిలో ఉందొ తెలుసుకొనేందుకు కొవ్వుని లెక్కల్లో కొలిచేందుకు బెల్లో అనే కొత్త పరికరం రూపొందించారు శాస్త్రజ్ఞులు . అది కేవలం మూడు సెకండ్ల లోనే పొట్టని స్కాన్ చేస్తుంది . సాధారణంగా కొంత కొవ్వు చర్మం లోపలి పొరల్లో పేరుకొంటే మరికొంత పొట్ట దగ్గర ఉండే కండరాల దగ్గర కొంత చేరుకొంటుంది . దీన్ని తెలుసుకోవటం కోసం ఈ బెల్లో స్కాన్ చేసి ఆ సమాచారం నిముషాల్లో బ్లూ టూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు పంపుతుంది . ఈ పరికరం తో పాటు ఓ యాప్ కూడా సిద్ధంచేశారు . ఎవరికీ వాళ్ళు రీడింగ్ చూసుకొని కొవ్వుస్థాయిని తెలుసుకోవచ్చు .

Leave a comment