క్రిష్టమస్ రాబోతుంది. ఈ సెలబ్రెషన్స్ లో సాయం కాలపు వేడుకల్లో వెలిపోవాలనుకొంటే అందమైన ఈవినింగ్స్ గౌన్స్ చాలా బావుంటాయి.కొన్ని నిలువుగా ఒకే పొడవుతోను ఉంటాయి. అలా నచ్చవు అనుకొంటే అలలు అలలుగా ఉండే లేయర్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. ఈ లాంగ్ గౌన్ లు శాటిన్ ,నెటెక్ సెక్విన్ ఎంబ్రాయిడరీల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. చక్కని లేయర్ లాంగ్ గౌన్ తో పాటు మెడలో మెరిసిపోయే బోకర్, చెవులకు రాళ్ళ స్టడ్స్ పెట్టుకొంటే చాలు ప్రత్యేకత వచ్చి చేరినట్లే .చూసేందుకు భారీగా ఉండే తేలికైన వస్త్రశ్రేణితో రూపొందించే నడుముకిందుగా వెడల్పుగా ఉండే గౌన్ లు ఆకర్షియణీయంగా ఉంటాయి. ఇక శాటిన్ తో కుట్టిన లాంగ్ గౌన్ అయితే తక్కువ బరువుతో తేలిగ్గా హాయిగా ఉంటుంది. ఈ సెలబ్రేషన్స్ కు లాంగ్ గౌన్స్ బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి.
Categories