Categories
Nemalika

చూద్దాం చేద్దాం అనటం మీకే ప్రమాదం.

నీహారిక,
పిల్లల పెంపకం ఎంతో బాధ్యతతో  ప్రతి దానినీ శ్రద్దగా వాళ్ళతో వ్యవహరించాలి. పిల్లలు ఏదైనా అడిగితే అది ఇవ్వటం ఇష్టం లేకపోతే వాళ్లకి స్పష్టంగా చెప్పాలి కానీ చూద్దాం లే, చేద్దాం లే అని దాట వేయడం చాల తప్పు. ఇలాంటి సమస్య ధోరణి సమంజసం కాదని, అటూ ఇటూ సమస్య ధోరణి వద్దంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుదరదు అని చెప్పవలసి వస్తే దానికి కట్టుబడి ఉండాలని. పిల్లలు బ్రతిమిలాడితే లొంగి పోతే మీకే ప్రమాదం. అలా బ్రతిమిలాడి పెద్ద వాళ్ళను తమ దారికి తెచ్చుకోవచ్చని పిల్లలకు అర్థమైతే ఇక ఎప్పుడు ఇదే వ్యవహారం రిపీట్ అవతుంది. అలాగే ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఒకే మాట పై నిలబడి పిల్లలను కట్టడి చేయాలి అంతే గానీ ఒకరు వద్దంటే ఇంకొకళ్ళు అవునంటే పిల్లలకు అలుసై పోతారు. ఇక కొన్నాళ్ళకు వాళ్ళు ఇద్దరి మాట వినకుండా పోతారు. అలాగే శ్రద్దగా వాళ్ళతో జాగ్రతగా వ్యవరించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment