ప్రత్యేక సందర్భాలు, రోజువారీగానూ చుడీదార్ బావుంటుంది. పైగా ఇప్పుడు కొన్నీ కాలేజీల్లో ఇవే వేసుకోవాలంటున్నారు. జీన్స్ పూర్తిగా నిషేధం. మోడ్రన్ డ్రెస్ ల్లో చుడీదార్ చాలా అందమైంది. చక్కని రంగులు విభిన్నమైన రంగులతో ప్రత్యేకంగా ఉంటుంది. చందేరీ కుర్తాకు బ్లాక్ ప్రింట్ వేయిన్డ్ కోట్ వేసుకొని కుచ్చిలు వేలాడే మంగళగిరి దుపట్టా వేసుకొంటే అందమే అందం. చందేరీ వస్త్రశ్రేణితో కుట్టిన అనార్కాలీకి ఎంబ్రయిడర్ దుపట్టా మ్యాచింగ్ గా వస్తుంది. ఇవీ బావున్నాయి. డబుల్ లేయిన్డ్ చుడీదార్ లకు, పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన కాటన్ సల్వార్ సూట్ లు కూడా అమ్మాయిలకు బావుంటాయి. ఎంచుకోనే వస్త్రశ్రేణి ని బట్టే డ్రెస్ లు బావుంటాయి.

Leave a comment