పిల్లలు అబద్దాలు ఆడితే మనకి ఒళ్ళు మండిపోతుంది. ఒక పరిశోధన ఏం చెబుతుందంటే పిల్లల చుట్టు వాతావరణాన్ని పెద్దవాళ్ళు చేసే పనులు తమ ప్రవర్తన బట్టే అబద్దాలు గాని ఏవైనా నేర్చుకుంటారు.పన్నెండు సంవత్సరాలు ఉన్న వందమందిని ఎంపిక చేసి వాళ్ళ ప్రవర్తనను,కుటుంబ నేపథ్యం ఇంట్లో వాళ్ళ ప్రవర్తన,చదువు,ఉద్యోగం అన్ని కూలంకషంగా పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.పెద్దవాళ్ళు ఎదైన విషయం తప్పించుకోవల్సి వస్తే ఎలాంటి కబుర్లు చెప్తారు, చిన్న చిన్న అబద్దాలు సంకోచించకుండా ఎలా ఆడతారో చూసి నిశితంగా గమనించి మరి నేర్చుకుంటారట.ఆరు నుంచి 12 ఏళ్ళ పిల్లలు అబద్దం చెప్పాలో వద్దో తెల్సుకోలేక సతమతమవుతారటకూడ.ఇక పెద్దవాళ్ళని చూసి చక్కగా తర్ఫీదు పొందిన పిల్లలు తేలికగా అబద్దాలు చెప్పేస్తారట

Leave a comment