వెనిగర్ తో దుస్తులు శుభ్రంగా మెత్తగా అయిపోతాయి వెనిగర్ మల్టీ టాస్కర్ ఇది బట్టలను సాఫ్ట్ గా ఉంచడంతో పాటు వాషింగ్ మిషన్ లో  సున్నం ప్రమాణం పెరగటాన్ని తగ్గిస్తుంది. దీని తో వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.వెనిగర్ అంత సువాసనతో ఉండదు. కాని దుస్తులు పొడిగా ఆరిపోయాక వెనిగర్ వాసన ఉండదు. చిన్న స్పూన్ వెనిగర్ కలిపిన చాలు బట్టలు రంగు పోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్ ఆనవాళ్లు దుస్తులకు ఉంటే కొందరికి ఇరిటేషన్ వస్తుంది. వెనిగర్ తో ఇలాంటి సమస్యలు రావు సున్నితమైన చర్మం గల వాళ్ళకి వెనిగర్ వాడకం బెస్ట్ డిస్టిల్డ్ వైట్ వెనిగర్ ఒక అరకప్పు కలిపిన నీళ్ళతో ఉతికి బట్టలు జాడిస్తే చాలు.

Leave a comment