ఫ్రిజ్ వాడకంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మన్నికగా ఉంటుంది ఫ్రిజ్ కు గోడకు మధ్య కనీసం అర అడుగు దూరం అయినా ఉండాలి. స్వచ్ఛమైన గాలి ధారాళంగా వస్తుంటేనే ఎయిర్ ఫిల్టర్స్ బాగా పని చేస్తాయి. అలాగే పవర్ ఆఫ్ చేసి ఫ్రిజ్ ను క్లిన్ చేయాలి. ఫ్రిజ్ డోర్ ఎక్కువసేపు తీసి ఉంచకూడదు. చల్లని గాలి బయటికి పోయి పదార్ధాల తాజాదనం తగ్గిపోతుంది. పదార్ధాల మీద మూతలు తప్పనిసరిగా ఉండాలి. ఫ్రిజ్ ను వారానికి ఒకసారైనా డిఫ్రాస్ట్ చేయాలి. పదార్ధాలన్నీ బయటకు తీసి తుడవాలి. వెనిగర్ నీళ్ళు సమపాళ్ళలో కలిపి అందులో ముంచిన క్లాత్ తో తుడిస్తే బాక్టీరియా నశించిపోతుంది. సోడియం బైకార్బొనేట్ కలిపిన నీటిలో ముంచిన క్లాత్ తో తుడిస్తే ఫ్రిజ్ లోపలి అరలకు పట్టేసిన పదార్ధాల వాసనలు పోతాయి.

Leave a comment