Categories
వంట గదిని సక్రమంగా నీట్ గా ఉంచుకొంటే పని తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. ముందుగా వంటగదికి సంబంధించిన అన్ని వస్తువులు మూతలు సరిగ్గా బిగుతూగా ఉంటే డబ్బాల్లో సర్దుకొని మాటి మాటికీ తీసి చూసుకొనే అవసరం లేకుండా పేర్లు రాసిన స్ట్రిప్ట్స్ అంటించికోవాలి. పప్పుల్ని , స్రైస్ లను విడివిడిగా కంటెయినర్లలో ఉంచుకోవాలి. పాలు వలికినా కూరగాయాలు కోశాక కిచెన్ టాప్ తుడిచేందుకు అదనపు క్లీనింగ్ క్లాత్ లను వేరు వేరుగా పెట్టుకొవాలి. ప్రతి రోజు వంట తరువాత అన్నింటినీ శుభ్రంగా వేడి నీళ్ళతో ఉతికి ఎండలో ఆరేయాలి. క్లీనింగ్ క్లాత్ వెంటవెంటనే మారుస్తూ ఉండాలి. ట్రాష్ బ్యాగ్ లను అదనంగా వంటింట్లో ఉంచటం వల్ల పరిశుభ్రత పెరుగుతోంది.