వంట గది కాస్త తీరుగా అమర్చుకొంటేనే ఉదయపు పని వేళల్లో పని సులువుగా తీర్చుకోవచ్చు. అన్ని పదార్ధాలు డబ్బల్లో సర్ధేసి వాటి పైన లేబుల్ రాసి పెట్టుకోవాలి. అన్నీ డబ్బాలు ఇప్పుడు ఒకే మాదిరిగా ఉంటున్నాయి కనుక స్ట్రిప్స్ అంటించాలి. పప్పులు, స్ప్రైస్ లు ఒకటికి మించి ఎక్కువ కంటెయినర్లలో భద్రపరుచకూడదు. అలాగే కిచెన్ గట్ట టాప్ తుడిచేందుకు హాండీ వైపర్ గానీ ,క్లీనింగ్ క్లాత్ ను దగ్గరగా ఉంచుకోవాలి. భారీగా పెద్దగా ఉండే వస్తువులు కాప్ బోర్డుల్లో అందుబాటులో ఉండాలి. లేదా అవన్నీ పోరుగుల్లో ఉండాలి. ఎక్కువ వస్తువులు పడతాయి కనుకు కావల్సినవి వెంటవెంటనే తీసుకోవచ్చు . కిచెన్ లో ట్రాష్ బ్యాగ్స్ ఉంచుకోంటే ఎప్పటి చెత్త అప్పుడు క్లీన్ అయి పరిశుభ్రంగా ఉంటుంది.

Leave a comment