ఇల్లు క్లినింగ్ లో కొన్ని మెలుకువులు ఉన్నాయి . వీటిని తెలుసుకొంటే పని త్వరగా ముగుస్తుంది . ఒవేన్ క్లిన్ చేయాలంటే ,అడుగున మాడిపోతే బేకింగ్ షోడా చల్లి డిస్టల్డ్ వైట్ వెనిగర్ స్ప్రే చేయాలి . మిశ్రమం నురగలు తేలుతుంది . రాత్రంతా ఆలా వదిలేసి ఉదయం తడి వస్త్రంతో తుడిచేయవచ్చు . సీలింగ్ ఫ్యాన్ రెక్కలు పాతదిందు కవర్ తొడిగి గట్టిగా లాగీ తుడిస్తే దుమ్ము కింద ఉన్న మంచాలపైన ,ఫర్నిచర్ పైన పడకుండా ఉంటుంది . ఉడ్ వర్క్ ఉంటే వీటిపై పేరుకోన్న దుమ్ము ధూళిని లెమెన్ ఆయిల్ వైట్ వెనిగర్ కలిపి తుడిస్తే మెరుస్తాయి . డిష్ వాషర్ అడుగున కప్పు బేకింగ్ సోడా వేసి అలావదిలేసి వేడినీళ్ళతో ,వెనిగర్ వాడుతూ క్లిన్ చేయవచ్చు . తలుపులు ,కిటికీలు బాత్ రూమ్ లో ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ రాడ్స్ ని క్లిన్ చేయాలంటే మెత్తని వస్త్రం క్లినర్ ఉపయోగించాలి . విండో గ్లాస్ లను తడి పేపర్ తుడిస్తే శుభ్రం అయిపోతాయి . లెమెన్ ఆయిల్ స్ప్రే చేసి స్పాంజ్ తో తుడిచేయాలి .

Leave a comment