కోవిడ్ తో సహజీవనం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. బయట పనులు చేసుకోవటం ఆఫీసులకు వెళ్ళటం తప్పనిసరి అలాటప్పుడు స్వీయ నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం. కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.పని ప్రదేశాల్లో గుంపులుగా ఉండవద్దు 40, 60 సెకన్ల పాటు చేతులు సబ్బుతో శుభ్ర పరచుకోవాలి.శానిటైజర్ రాసుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.జలుబు ,దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి ఉద్యోగులందరూ ఒకే చోట  భోజనం చేయటం మానేయాలి.కార్యాలయాల్లో క్రమం తప్పకుండా వైరస్ రహిత  పక్రియను నిర్వహించేలా జాగ్రత్త పడాలి.

Leave a comment