దాదాపుగా మన వంటింట్లోకి అన్నీ నాన్ స్టిక్ పాట్స్ ప్యాన్లే . ఆరోగ్యానికి మంచివని ,నూనె అధికంగా వేయనక్కర్లేదని ఇవే వాడతాం. ఒక్కసారి అను మానం వస్తుంది . వీటివాడకం మంచిదేనా ? వీటి కోటింగ్ విడుదల చేసే రసాయనాలు హానికరం అనటం వాస్తవమేనా అని. కానీ సరైన గైడ్ లైన్స్ అనుసరిస్తే నాన్ స్టిక్ వంట పాత్రలు సురక్షితమే అంటారు. ఎక్సపెర్ట్స్. కానీ నాన్ స్టిక్ కోటింగ్స్ లో పర్ ఫ్లోరో క్లోనిక్ యాసిడ్ ఆనవాళ్లు ఉంటాయి. వీటిని బాగా  వేడిచేసినప్పుడు ఏ.ఎఫ్. బి .ఎల్ గ్యాస్ ప్యాన్ ఊపిరి తలపై నుంచి పోతుంది. నాన్ స్టిక్ పాత్రల్ని ఎప్పుడు కూడా తక్కువ మధ్యస్థంగా వుండే సెగపైనే ఉంచాలి.పై ఊపిరితలం  పాడైనట్లు అంటే నాన్ స్టిక్ కోటింగ్ పోయి ప్యాన్ తెల్లగా కనిపిస్తుందా వాటిని మార్చేయాలి. ఎంతకాలం వాడచ్చు అన్నది టైం చెప్పటం కష్టం కానీ కోటింగ్ లో తేడా గుర్తించగానే తీసేయటం బెటర్ .

Leave a comment