వైవిధ్యమైన కాక్ టైల్ రుచులూ మెరుగైన ఆతిథ్యం తో మీనాక్షి సింగ్ ప్రారంభించిన బార్ ప్రపంచంలోనే అత్యున్నతమైన 100 బార్ లో ఒకటిగా నిలిచింది. ఈమె నడిపే సైడ్ కార్ బార్ పాత గ్రంథాలయం లాగా బిలియర్డ్స్ రూమ్ లాగా ఉంటుంది.మీనాక్షి టీమ్ ప్రత్యేకమైన రుచులతో డ్రింక్స్ తయారు చేస్తారు. ఈ డ్రింక్ కి అవసరమైన దినుసులు బార్ వెనుక ఉన్న గార్డెన్ లో పండిస్తారు హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేస్తున్న మీనాక్షి సింగ్ పాకెట్ మనీ కోసం ప్రైవేట్ పార్టీలు ఫంక్షన్స్ లో డ్రింక్స్ అందించేందుకు వెళ్లి కాక్ టైల్స్ కలపటం నేర్చుకొని ఆ ఇష్టాన్నే పూర్తిగా మార్చుకుంది.యంగ్ రూప్ లామా తో కలిపి గురుగ్రమ్ లో కాక్ టైల్స్ అండ్ డ్రీమ్స్ స్పీక్ ఈజీ పేరుతో బార్ ప్రారంభించారు.ఐదేళ్ల తర్వాత సైడ్ కార్ బార్ తెరిచారు.

Leave a comment