ఈ ఎండలో శక్తి నిచ్చే పానీయాలు ఇంట్లోనే చేసుకోవచ్చు.కోకోనట్ మిల్క్ షేక్ చాలా రుచిగా అలిసిపోయిన శరీరానికి తక్షణ శక్తి నిచ్చేదిగా ఉంటుంది. లేత కొబ్బరి మీగడ ఒక కప్పు పావు లీటర్ పాలు, పంచదార రెండు స్పూన్లు ఐస్ క్రీమ్ అర కప్పు కొబ్బరి పాలు పావు కప్పు తో  ఎముకల ఆరోగ్యాన్నిచ్చే మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. అన్ని పదార్థాలు మెత్తగా గ్రైండ్ చేసుకుని కప్పు కొబ్బరి పాలు, కొబ్బరి తురుము తో గార్నిష్ చేసుకుంటే చాలు. దాన్ని చల్ల చల్లగా తాగితే బాగుంటుంది.కొబ్బరి లో ఉండే పోషకాలు పాలలో ఉండే క్యాల్షియం రెండు శరీరానికి శక్తినిస్తాయి.

Leave a comment